BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 06:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భగత్ సింగ్ కాలనీలో ఇంటింటికీ వెళ్లిన స్వామిదాస్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Sep, 2026 - 06:44 PM
35 వీక్షణలు

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాస్ శనివారం ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమంలో భాగంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, ప్రస్తుతం అందుతున్న ప్రభుత్వ సేవలు, కాలనీలో నెలకొన్న సమస్యలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంపై కూటమి నాయకులు గతంలో చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. లడ్డూ వ్యవహారంలో కూటమి నాయకులు చేసిన ఆరోపణలు అవాస్తవమని సీబీఐ తేల్చిందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో పోలీసులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయని స్వామిదాస్ అన్నారు. కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.

సాక్షి ప్రసారాలను నిలిపివేయాలని కేబుల్ ఆపరేటర్లపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తోందని స్వామిదాస్ ఆరోపించారు. నిజాలను ప్రజలకు తెలియజేసే సాక్షి ప్రసారాల విషయంలో కూటమి నాయకులు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపైనా నల్లగట్ల స్వామిదాస్ విమర్శలు చేశారు. ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నారని, వైఎస్ జగన్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలకు స్పష్టత ఉందని, చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుపై ప్రజలే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారని స్వామిదాస్ పేర్కొన్నారు.

గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నట్లు స్వామిదాస్ తెలిపారు.