BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 05:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టీడీపీ ప్రభుత్వ వెన్నుపోటు పాలనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఉద్యమ బాట

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:39 PM
140 వీక్షణలు

మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 

గడిచిన రెండేళ్లలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, ఈ నెల 4న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నూజివీడు పట్టణంలోని ద్వారకా సెంటర్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో నూజివీడు మాజీ శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. సూపర్ సిక్స్ సహా పలు కీలక హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదని, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని ఆరోపించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు.