BREAKING
thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి
Date of Publish : 22 August 2026, 07:36 pm
Posted by : కూనురు మధు

టీటీడీ భూమికి రెవెన్యూ అధికారుల సర్వే

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Aug, 2026 - 07:36 PM
207 వీక్షణలు

టీటీడీ భూమికి రెవెన్యూ అధికారుల సర్వే

నల్గొండ జిల్లా  చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని భువనగిరి రోడ్డులో ఉన్న టీటీడీ కళ్యాణ మండపం భూమి వ్యవహారంపై రెవెన్యూ అధికారులు శనివారం సర్వే ప్రక్రియను ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. చిట్యాల పట్టణంలోని 649 సర్వే నంబర్‌లో టీటీడీకి సంబంధించిన ఎకరం 12 గుంటల భూమి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన హద్దులను పూర్తిస్థాయిలో నిర్ధారించేందుకు శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సర్వే అనంతరం భూమి యొక్క వాస్తవ విస్తీర్ణం, హద్దులను స్పష్టంగా గుర్తించి, వాటిని రికార్డుల్లో నమోదు చేయడంతో పాటు హద్దులను పటిష్టంగా ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. టీటీడీ కళ్యాణ మండపం భూమి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ సర్వేకు ప్రాధాన్యత ఏర్పడింది.