BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 25 June 2026, 10:39 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టి.గుడిపాడు శివారులో కోడిపందాలపై పోలీసుల దాడి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 10:39 AM
216 వీక్షణలు

చాట్రాయి, జూన్ 24: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం టి.గుడిపాడు గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై చాట్రాయి పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాలు, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణకు అందిన సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. దాడిలో ఒక కోడి పుంజు, రెండు కోడి కత్తులు, రూ.2,800 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఆరు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ డి. రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలను ఆర్థికంగా నష్టపరిచే జూద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. జూదాన్ని నిర్వహించే వారిపైనా, పాల్గొనే వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడిపందాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్-112కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.