BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 10:32 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టోలిచౌకి ఎస్సై రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 10:32 AM
79 వీక్షణలు

హైదరాబాద్: కేసు నమోదు చేయకుండా, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన టోలిచౌకి ఎస్సై ఆర్. పాండు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదును స్వీకరించిన సిటీ రేంజ్–1 ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. ఈ క్రమంలో ఎస్సై ఆర్. పాండు రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కేసు నమోదు చేయకుండా ఉండటంతో పాటు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోకుండా చర్యలు తీసుకునేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు.

ఎస్సైపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిందితుడిని నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.