BREAKING
thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం
Date of Publish : 13 May 2026, 01:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 May, 2026 - 01:25 PM
169 వీక్షణలు

ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!

సమాజంలో ఎన్నో ఏళ్లుగా వివక్ష, నిరాకరణ, ఉపాధి సమస్యలు, గుర్తింపు కోసం పోరాటం ఎదుర్కొంటున్న ట్రాన్స్‌జెండర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణతో పాటు వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకంగా ‘రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ ఎంఎస్ నంబర్-14 విడుదల చేసింది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్-2019’, రూల్స్-2020 మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది. మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ బోర్డు పనిచేయనుంది.

ఈ బోర్డులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులను ప్రభుత్వం నామినేట్ చేసింది. ఆంధ్రా ప్రాంత ప్రతినిధిగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్, రాయలసీమ ప్రతినిధిగా తిరుపతి జిల్లా కలెక్టర్ వ్యవహరించనున్నారు. ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులుగా కోటా ప్రేమ్ సాగర్ రాయ్ (తూర్పుగోదావరి), నక్క జీవన్ కుమారి (గుంటూరు), బోను దుర్గ తదితరులను నియమించారు.

ఈ వెల్ఫేర్ బోర్డు ద్వారా ట్రాన్స్‌జెండర్లకు విద్య, వైద్యం, ఉపాధి, గృహ వసతి, న్యాయ పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ట్రాన్స్‌జెండర్ వర్గాల సమస్యలను నేరుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఈ బోర్డు పనిచేయనుండటంతో, ఈ నిర్ణయాన్ని పలువురు సామాజిక కార్యకర్తలు స్వాగతిస్తున్నారు.