మూడు రోజుల విరామం తర్వాత నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్ / Ntoday News: మూడు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం అయ్యాయి . ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి .
సమావేశాల్లో తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగనుంది. అనంతరం 22A భూములు, ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన 22A భూముల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు శాసనసభలో ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వివరణ ఇవ్వనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలపై ఆసక్తి నెలకొంది.
అలాగే ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం పరిస్థితులు, వ్యవసాయంపై దాని ప్రభావం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆయా అంశాలపై ప్రభుత్వం సమాధానాలు ఇవ్వనుంది.