BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 09:38 am
Posted by : K MAHESH

ఉద్యోగుల హక్కుల సాధనకు TGO సమరశంఖం..

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
08 Nov, 2026 - 09:38 AM
27 వీక్షణలు

51 శాతం ఫిట్‌మెంట్‌తో రెండో PRC అమలు చేయాలని డిమాండ్

మహబూబాబాద్ (ఎన్ టుడే న్యూస్), నవంబర్ 8:

ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (TGO) పోరాటానికి సిద్ధమవుతోంది. రెండో వేతన సవరణ సంఘం (PRC)లో భాగంగా 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (DA) బకాయిలను వెంటనే విడుదల చేయాలని సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే నేషనల్ హెల్త్ స్కీమ్ (NEHS) కింద కార్పొరేట్ ఆసుపత్రుల్లో సంపూర్ణ నగదు రహిత వైద్య సేవలు అందించాలని కోరారు.

TGO మహబూబాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం శనివారం IDOC కార్యాలయ ఆవరణలో జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రఫీ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) పురుషోత్తం మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక ప్రయోజనాలు, వైద్య సదుపాయాలు, సంఘ బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. ఉద్యోగుల హక్కుల సాధనకు సంఘం ఐక్యంగా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

51 శాతం ఫిట్‌మెంట్‌తో రెండో PRC అమలు చేయాలి

జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు న్యాయమైన వేతన సవరణ కల్పించాలని కోరారు. రెండో వేతన సవరణ సంఘం అమలులో భాగంగా 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన కరువు భత్యం (DA) బకాయిలను ఎలాంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

NEHS కింద సంపూర్ణ క్యాష్‌లెస్ వైద్యం కల్పించాలి

ఉద్యోగులు, పెన్షనర్లకు NEHS పథకం కింద కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎలాంటి పరిమితులు, ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంపూర్ణ నగదు రహిత వైద్య సేవలు అందించాలని సంఘ నాయకులు కోరారు. శస్త్రచికిత్సలకు అవసరమైన ఇంప్లాంట్లు, వైద్య పరికరాలు, ఇతర చికిత్సా ఖర్చులను కూడా పథకం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని సమావేశం తీర్మానించింది.

TGO జిల్లా నూతన కార్యదర్శిగా అడపా రవీంద్ర బాబు

జిల్లా సంఘంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేస్తూ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. జిల్లా కార్యదర్శిగా అడపా రవీంద్ర బాబును ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా మహేష్, శ్రీనివాసరావు, సుమలత, వినోద్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కుసుమ విద్యాసాగర్, జాయింట్ సెక్రటరీలుగా దూపటి శ్రీనివాస్, మీర్జా మున్వర్ బేగ్, సక్కుబాయిని ఎంపిక చేశారు. కమిటీ సభ్యులుగా సోమన్న, శ్రీకాంత్‌లను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సమావేశంలో అభినందనలు తెలిపారు.

కొప్పు ప్రసాద్‌కు ఆత్మీయ సన్మానం

మహబూబాబాద్ జిల్లా TGO కార్యదర్శిగా సేవలందించిన కొప్పు ప్రసాద్ బదిలీపై ఇతర ప్రాంతానికి వెళ్లిన సందర్భంగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జిల్లా సంఘం అభివృద్ధికి, ఉద్యోగుల ఐక్యతకు, సంఘ కార్యక్రమాల నిర్వహణకు ఆయన అందించిన సేవలను నాయకులు కొనియాడారు. బదిలీ అయినప్పటికీ TGOతో ఆయన అనుబంధం, సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు.

TGO కార్యాలయ భవన నిర్మాణంపై చర్చ

2027 సంవత్సరానికి TGO డైరీలు, క్యాలెండర్లను ప్రచురించాలని సమావేశంలో నిర్ణయించారు. జిల్లా కేంద్రంలో సంఘానికి సొంత కార్యాలయ భవనం ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో స్థల కేటాయింపు, భవన నిర్మాణానికి సంబంధించిన తదుపరి చర్యల పురోగతిపై చర్చించారు. ఈ లక్ష్య సాధనకు సంఘ సభ్యులంతా సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) పురుషోత్తం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్, JAC చైర్మన్ వి. శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ కళ్ళెం వెంకటరెడ్డి, TGO జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ వేల్పుల శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ రాజశేఖర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ జగదీష్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ దేశి రామ్ నాయక్, మరియన్న, DPRO రాజేంద్ర ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ చిలుకబాబు, జనరల్ సెక్రటరీ ఎం. రాజశేఖర్, క్రీడా, సాంస్కృతిక కార్యదర్శి మీర్జా మన్సూర్ బేగ్, కార్యవర్గ సభ్యులు బి. వీరన్న, ఓ. శ్రీనివాస్, మహమ్మద్ ఆసిఫ్ పాషా, కె. జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.