BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 23 June 2026, 11:46 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తాడిపత్రిలో ప్రైవేట్ పాఠశాలల బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 11:46 AM
97 వీక్షణలు

నిబంధనలు పాటించని పలు బస్సులకు జరిమానా

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రైవేట్ పాఠశాలల బస్సులపై రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా చేపట్టిన ఈ తనిఖీల్లో పలు బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు.

బస్సుల్లో అత్యవసర ద్వారాలు, ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లు, ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు, వాహనాల ఫిట్‌నెస్‌, బీమా, డ్రైవర్ల లైసెన్సులు తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. తనిఖీల సందర్భంగా కొన్ని బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, అవసరమైన పత్రాలు లేకపోవడం వంటి లోపాలు వెలుగుచూశాయి.

నిబంధనలు ఉల్లంఘించిన బస్సుల యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు జరిమానాలు విధించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, అన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు.

రానున్న రోజుల్లో కూడా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు.