కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఆధ్వర్యంలో నిరసన
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
తేది -08-09-2026
నల్గొండ. జిల్లా. చిట్యాల.
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో BRS పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి నిరసనగా, కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ ఎర్రవల్లి సమీపంలో నిర్వహించిన “సావు డప్పు” నిరసన కార్యక్రమంలో చిట్యాల మండలానికి చెందిన దళిత బిడ్డలు పాల్గొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో జన్నపాల శ్రీను, నర్సింహా, యాదగిరి, లింగయ్య, రాజేష్ తదితరులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
తెలంగాణలో సామాజిక న్యాయం, దళితుల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు తెలిపారు.