BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 17 June 2026, 07:07 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ రవాణా శాఖలో కఠిన ఆదేశాలు: లంచాలకు సస్పెన్షన్‌ వేటు, ‘కోడ్‌’ వ్యవస్థపై నిషేధం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Jun, 2026 - 07:07 AM
153 వీక్షణలు

హైదరాబాద్‌: రవాణా శాఖలో అవినీతిని అరికట్టేందుకు ఉన్నతాధికారులు కఠిన చర్యలకు దిగారు. లంచాలు తీసుకుంటే తక్షణ సస్పెన్షన్‌ విధిస్తామని హెచ్చరించారు. ఏజెంట్లు, సిబ్బంది మధ్య ఉపయోగిస్తున్న ‘కోడ్‌’ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

రవాణా శాఖ విజిలెన్స్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఎం. చంద్రశేఖర్‌ గౌడ్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు కీలక మార్గదర్శకాలు పేర్కొన్నారు. డ్రైవింగ్‌ టెస్ట్‌ కేంద్రాలు, ఆర్టీఏ కార్యాలయాల పనితీరులో పారదర్శకత పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

డ్రైవింగ్‌ పరీక్ష రోజున దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ట్రాక్‌ వద్ద హాజరుకావాలని, ఎంవీఐ అధికారి ఆధార్‌ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా గుర్తింపును స్వయంగా నిర్ధారించాలని ఆదేశించారు. పరీక్షలో వాహనం స్టార్ట్‌ చేయడం నుంచి రివర్స్‌, లేన్‌ డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పాటించడం వరకు అన్ని నైపుణ్యాలను పూర్తిగా పరీక్షించాలని స్పష్టం చేశారు.

ట్రాక్‌ ప్రవేశం వద్ద “ప్రైవేటు ఏజెంట్లకు ప్రవేశం నిషేధం” బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని, అవి నిలిపివేయడం లేదా ట్యాంపరింగ్‌ చేయడం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన శాఖాపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డ్రైవింగ్‌ ట్రాక్‌ పరిసరాలు, ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్లు, ఏజెంట్లు, డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రతినిధులకు పూర్తిగా నిషేధం విధించారు. ఏజెంట్లకు సహకరించినా లేదా లంచాలు తీసుకున్నా వెంటనే సస్పెన్షన్‌ చేసి విచారణ చేపడతామని స్పష్టం చేశారు.

అదే విధంగా ఏసీబీ బృందాల రాకను ముందుగానే తెలుసుకునేందుకు ఉపయోగించే ‘కోడ్‌లు’, సంకేతాలు, నంబర్‌ సీక్వెన్స్‌లను పూర్తిగా నిషేధించారు. ప్రతి నెలా 15వ తేదీకి కమిషనర్‌ కార్యాలయానికి కాంప్లయన్స్‌ నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.