BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 26 June 2026, 06:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ సరిహద్దు లింగగూడెంలో అక్రమ ఇసుక నిల్వలు.. తెలంగాణకు తరలింపునకు సిద్ధమైన వాహనాలు..!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:09 AM
174 వీక్షణలు

ఏలూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన లింగగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను తెలంగాణకు తరలించేందుకు దళారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ శివార్లలో ముందుగానే ఇసుకను డంపులుగా నిల్వ ఉంచి, రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా సరిహద్దు దాటి తరలించేందుకు సిద్ధం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో గతంలోనూ ఇలాంటి అక్రమ ఇసుక రవాణా జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, లింగగూడెంలో కూడా అదే తరహా కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇసుక మాఫియా యథేచ్ఛగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే అక్రమ ఇసుక వ్యాపారం పెరుగుతోందని ఆరోపిస్తున్న గ్రామస్తులు, రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను స్వాధీనం చేసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

లింగగూడెంలోని ఇసుక డంపులపై సంబంధిత శాఖలు వెంటనే దృష్టి సారించి వాస్తవాలను వెలికితీయడంతో పాటు, తెలంగాణకు అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.