BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తెలంగాణలో దూకుడు పెంచిన ఏసీబీ వేట | 441 కేసులతో అవినీతి అధికారుల్లో కలకలం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 06:09 AM
88 వీక్షణలు

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులపై చేపడుతున్న ట్రాప్ కేసులతో మొదలైన దర్యాప్తు ఇప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఉన్నతాధికారులపై కూడా విస్తరించింది. 2024 నుంచి ఇప్పటివరకు 441 కేసులు నమోదు కావడంతో అవినీతి వ్యవస్థపై ఏసీబీ గట్టి దాడి కొనసాగుతోంది.

గతంలో ఎక్కువగా లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది, పోలీసు, రెవెన్యూ విభాగ ఉద్యోగులే వార్తల్లో ఉండగా, ప్రస్తుతం కోట్లాది రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన టాప్ అధికారులపై కూడా దర్యాప్తు వేగం పెరిగింది.

కేసుల పెరుగుదల ఇలా..

2021: 83 కేసులు

2022: 105 కేసులు

2023: 95 కేసులు

2024: 152 కేసులు (దాదాపు 60% పెరుగుదల)

2025: 199 కేసులు

2026 ఇప్పటివరకు: 90 కేసులు

డీఏ (ఆదాయానికి మించిన ఆస్తులు) కేసులు కూడా గణనీయంగా పెరిగాయి. 2021లో 2 కేసులు మాత్రమే ఉండగా, గత ఏడాది 15 కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 4 కేసులు నమోదయ్యాయి.

భారీ అక్రమాస్తుల కేసులు వెలుగులోకి

ఏసీబీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కొన్ని కీలక కేసులు:

టీఎస్ రెరా కార్యదర్శి, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో రియల్ ఎస్టేట్ అనుమతుల్లో అక్రమాలు, రూ.100 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు

కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజనీర్ ఎన్. శ్రీధర్ వద్ద సుమారు రూ.60 కోట్ల అక్రమ సంపాదన గుర్తింపు

విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ వద్ద రూ.70 కోట్ల అక్రమ ఆస్తులు వెలికితీత

హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి వద్ద రూ.50 కోట్లకు పైగా ఆస్తుల అనుమానాస్పద సంపాదన

వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ నివాసంలో రూ.1.10 కోట్ల నగదు, భారీ ఆస్తుల ఆనవాళ్లు

ఉన్నతాధికారులపై దృష్టి

తాజా దర్యాప్తుల్లో ఉన్నతాధికారుల ఇళ్లలో కిలోల కొద్దీ బంగారం, లక్షల రూపాయల నగదు, ఖరీదైన విల్లాలు, వ్యవసాయ భూముల పత్రాలు బయటపడుతున్నాయి. మార్కెట్ విలువతో పోలిస్తే వాస్తవ ఆస్తుల విలువ మరింత ఎక్కువగా ఉంటుందని దర్యాప్తు వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏసీబీ దూకుడుతో అవినీతి వ్యవస్థలో కలకలం నెలకొనగా, మరిన్ని కీలక కేసులు వెలుగులోకి వచ్చే అవకాశముందని సమాచారం.