BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 17 June 2026, 11:44 am
Posted by : ANNAPAREDDY SIVA NAGENDRA

తెనాలిలో దొంగల బీభత్సం: వరుస చోరీలతో ప్రజల్లో భయాందోళనలు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
17 Jun, 2026 - 11:44 AM
105 వీక్షణలు

గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో వరుస చోరీ ఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న దొంగతనాలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ఇటీవల హాఫ్‌పేటలో పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు నగదును అపహరించారు. అలాగే కట్టేవరంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేసరికి ఇంట్లోని నగలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. మరోవైపు రజకచెరువు ప్రాంతంలోని రాములవారి ఆలయంలో చోరీయత్నం జరగగా, ఎరుకలపూడిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాగి, ఇత్తడి సామగ్రిని దుండగులు అపహరించారు.

తాజాగా సుల్తానాబాద్‌లో ఓ మహిళ ఇంట్లో భారీ మొత్తంలో నగలు, నగదు మాయమైన ఘటన కలకలం రేపింది. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఈ చోరీల వెనుక ఒకే ముఠా ఉందా? లేక వేర్వేరు వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రజలు రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత పెంచాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేయాలని కోరుతున్నారు.