BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 12 June 2026, 05:03 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

తిరుపతి నగరంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 05:03 PM
94 వీక్షణలు

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రివర్యులు మరియు ఇతర ప్రముఖులు 12-06-2026 తేదీన తిరుపతి నగరంలో నిర్వహించబడనున్న "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో, ప్రజల భద్రత, సౌకర్యం మరియు ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఉదయం 08.00 గంటల నుండి మధ్యాహ్నం 02.00 గంటల వరకు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయబడనున్నవి.

ప్రజలు, ప్రయాణికులు మరియు వాహనదారులు క్రింది ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి పోలీసు శాఖకు సహకరించవలసిందిగా కోరడమైనది.

- *చిత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలు.*

ఒమేగా హాస్పిటల్ – చెర్లోపల్లి – జూపార్క్ – గరుడ సర్కిల్ – నంది సర్కిల్ – లీలామహల్ – కరకంబాడి మార్గం ద్వారా ప్రయాణించవలెను.

- *మదనపల్లి వైపు నుండి వచ్చే వాహనాలు.*

పీలేరు – రంగంపేట – శ్రీనివాస మంగాపురం – చెర్లోపల్లి – జూపార్క్ – గరుడ సర్కిల్ – నంది సర్కిల్ – ఫ్లైఓవర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవలెను.

- *ఆర్టీసీ బస్టాండ్ నుండి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలు.*

ఫ్లైఓవర్ – నంది సర్కిల్ – గరుడ సర్కిల్ – జూపార్క్ – చెర్లోపల్లి – ఒమేగా హాస్పిటల్ మార్గం ద్వారా ప్రయాణించవలెను.

- *కడప వైపు నుండి వచ్చే వాహనాలు.*

కట్టపుట్టాలమ్మ దేవాలయం – కరకంబాడి – మంగళం – లీలామహల్ మార్గం ద్వారా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకోవలెను.

- *నెల్లూరు, నాయుడుపేట వైపు నుండి వచ్చే వాహనాలు.*

వాజ్‌పేయి జంక్షన్ – ఓల్డ్ రేణిగుంట చెక్‌పోస్ట్ – రమణ విలాస్ సర్కిల్ – కట్టపుట్టాలమ్మ దేవాలయం – కరకంబాడి – మంగళం – లీలామహల్ – ఆర్టీసీ బస్టాండ్ మార్గం ద్వారా ప్రయాణించవలెను.

- *చెన్నై, పుత్తూరు వైపు నుండి వచ్చే వాహనాలు.*

గాజులమండ్యం సర్కిల్ – ఓల్డ్ రేణిగుంట చెక్‌పోస్ట్ – నారాయణాద్రి హాస్పిటల్ – బ్లిస్ సర్కిల్ మార్గం ద్వారా తిరుపతి నగరంలోకి ప్రవేశించవలెను.

-ప్రజలకు విజ్ఞప్తి

వాహనదారులు ముందస్తుగా తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకొని సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలి.

ట్రాఫిక్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలి.

ప్రజల సౌకర్యార్థం అమలు చేస్తున్న ఈ ట్రాఫిక్ మళ్లింపులకు సహకరించి కార్యక్రమం విజయవంతానికి తోడ్పడాలి.

అత్యవసర సేవలు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు మరియు ఇతర అత్యవసర సేవల వాహనాలకు పై ట్రాఫిక్ మళ్లింపులు వర్తించవు.

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్

తిరుపతి జిల్లా.