BREAKING
thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు
మంచి మాట
Date of Publish : 31 October 2026, 05:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మౌలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలపాల జ్యోతి పోటీ మూడు నక్షత్రాల గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి బక్కయ్య

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Oct, 2026 - 05:19 PM
20 వీక్షణలు

మౌలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలపాల జ్యోతి పోటీ మూడు నక్షత్రాల గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య పిలుపు చిత్తపూరు, అక్టోబరు 31: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామ ఎంపీటీసీ ఎన్నికల్లో సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ పార్టీ అభ్యర్థి కలపాల జ్యోతిని మూడు నక్షత్రాల గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏఐసీసీటీయూ జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య పిలుపునిచ్చారు. గ్రామంలో నెలకొన్న మౌలిక సమస్యలను పరిష్కరించడంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. గ్రామంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, కనీసం గ్రావెల్‌ రోడ్లు కూడా నిర్మించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి దీపాలు వెలగక ప్రజలు రాత్రివేళ చీకట్లో రాకపోకలు సాగించాల్సి వస్తోందని, విషసర్పాలు, ఇతర విషకీటకాల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలి గ్రామ పరిధిలోని సర్వే నంబరు 1/4లో సుమారు 125 ఎకరాల భూములకు రెవెన్యూ, అటవీ శాఖల సంయుక్త సర్వే నిర్వహించకపోవడంతో సాగుదారులు పట్టాలు పొందలేకపోతున్నారని వేముల బక్కయ్య పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ పార్టీ సాగుదారులతో కలిసి అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. సాగుదారులకు నోటీసులు జారీ చేసి సంయుక్త సర్వే నిర్వహించాలని, అటవీ భూముల నోటిఫికేషన్‌ను రద్దు చేసి అర్హులైన సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్మశానవాటికకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి గ్రామంలోని స్మశాన భూములు ఆక్రమణలకు గురయ్యాయని, అక్కడ పెద్ద భవనాలు, నివాసాలు, వాటర్‌ ట్యాంకు, సీసీ రోడ్లు నిర్మించడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యపై రెవెన్యూ, పంచాయతీ అధికారులు, సంబంధిత నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వెంటనే సర్వే నిర్వహించి ప్రత్యామ్నాయంగా స్మశానవాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. దళితవాడ సమస్యలను పరిష్కరించాలి గ్రామంలోని పడమటి దళితవాడలో ఇళ్లు నిర్మించుకున్న వారికి వాగు ఉందనే కారణంతో పట్టాలు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బక్కయ్య తెలిపారు. భూముల వర్గీకరణను పరిశీలించి, అవసరమైన మార్పులు చేసి అర్హులైన కుటుంబాలకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. గ్రామంలో అవసరమైన చోట్ల సీసీ రోడ్లు నిర్మించాలని, అర్హులైన పేదలకు మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు కేటాయించాలని, అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా హక్కుల పరిరక్షణకు పోరాటం ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మతోన్మాద ధోరణులు పెరుగుతున్నాయని, విద్యార్థులు, పౌరుల హక్కులకు భంగం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడే కలపాల జ్యోతిని ఎంపీటీసీ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ పార్టీ మండల అధ్యక్షుడు కలపాల వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు మల్లెపాము భవాని, చాట్ల బాబురావు, కలపాల సామ్యేలు, ఆలూరు బాబురావు, ఆలూరు వెంకటేష్‌, ఆలూరు ఏసు, కడపల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.