BREAKING
thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Date of Publish : 30 June 2026, 05:57 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు డివిజన్‌లో యూరియా పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డీవో ఏ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Jun, 2026 - 05:57 AM
103 వీక్షణలు

తిరువూరు, జూన్ 29: తిరువూరు డివిజన్‌లో యూరియా ఎరువుల పంపిణీ పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని ఆర్డీవో ఏ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో యూరియా పంపిణీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీ, తహసీల్దార్లు, ఎంఏవోలు, తిరువూరు డివిజన్ పరిధిలోని పీఏసీఎస్ ప్రతినిధులు, ప్రైవేట్ ఎరువుల దుకాణాల నిర్వాహకులు పాల్గొన్నారు.

యూరియా పంపిణీ పూర్తిగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని, అర్హులైన రైతులకు అవసరానికి అనుగుణంగా ఎరువులు అందించాలని అధికారులకు సూచించారు. స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, నిల్వ ఉంచడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎంఆర్ఓలు, ఎంఏవోలు తమ పరిధిలో యూరియా పంపిణీని నిరంతరం పర్యవేక్షించాలని, సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్లు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.