BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 August 2026, 12:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు: న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్.. కోర్టు విధుల బహిష్కరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 12:33 PM
87 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు తిరువూరు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

న్యాయవాదుల భద్రత, గౌరవం, వృత్తి పరిరక్షణ కోసం ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొచ్చి అమలు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని, వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సంకురాత్రి జనార్ధనరావు, ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి కృష్ణారెడ్డి, కార్యదర్శి కనపర్తి రాంబాబు, సీనియర్ న్యాయవాది మాకరాజు రామ మోహన రాజు, ఎం. కుమార్, నాగుబండి రామకృష్ణ, చిరుమామిళ్ల వెంకటేశ్వరరావు, అత్తులూరి శ్రీనివాసరావు, చింతబత్తిని రాజేంద్రబాబు, పల్లెపాటి శ్రీనివాసరావు, షేక్ సుభాని, చింతల వెంకటరెడ్డి, మేకల నాగేంద్ర ప్రసాద్, అంకిరెడ్డి అంజన్ రెడ్డి, షేక్ గౌసుద్దీన్, చిలక హేమంత్, మాలావత్ రాము, భూక్య రామారావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రభుత్వాన్ని కోరారు.