BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 01 August 2026, 07:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు సచివాలయం-1ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 07:10 PM
61 వీక్షణలు

తిరువూరు సచివాలయం-1ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

తిరువూరు సచివాలయం-1లో ఆకస్మిక తనిఖీ

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: మున్సిపల్ కమిషనర్ కె. మనోజ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులోని సచివాలయం-1ను శనివారం మున్సిపల్ కమిషనర్ కె. మనోజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను పరిశీలించి వాటి నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

కార్యాలయ వేళల్లో సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వం అందిస్తున్న సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించాలని ఆదేశించారు. ప్రతి రికార్డును నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించడంతో పాటు అవసరమైన వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని సూచించారు.

విధుల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని కమిషనర్ పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినా, ప్రజలకు అందుబాటులో లేకపోయినా, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించకపోయినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని కమిషనర్ కె. మనోజ సూచించారు.