BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 22 August 2026, 03:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా మొక్కలు నాటిన ఆర్డీవో కె. కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 03:21 PM
70 వీక్షణలు

తిరువూరు: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా మొక్కలు నాటిన ఆర్డీవో కె. కుమార్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల కేంద్రంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. తిరువూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె. కుమార్, మున్సిపల్ కమిషనర్ కె. మనోజతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆర్డీవో కె. కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. పరిశుభ్రమైన పరిసరాలతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ కె. మనోజ మాట్లాడుతూ పట్టణంలో పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

స్వచ్ఛత, పచ్చదనం సమన్వయంతో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించడమే స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.