BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 13 August 2026, 05:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Aug, 2026 - 05:07 PM
90 వీక్షణలు

తిరువూరులో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులో గురువారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో ఏ. కుమార్ జాతీయ జెండాను ఊపి తిరంగా ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆర్డీవో మాట్లాడుతూ.. దేశం స్వాతంత్ర్యం సాధించి 80 సంవత్సరాలు పూర్తయిన చారిత్రాత్మక సందర్భంగా ప్రతి పౌరుడు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని పేర్కొంటూ.. విద్యార్థులు దేశభక్తి భావంతో పాటు క్రమశిక్షణ, నిజాయితీ వంటి విలువలను అలవర్చుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను తెలుసుకుని, వారి ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

ర్యాలీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడంతో పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ భావాన్ని చాటారు.

కార్యక్రమంలో తహసీల్దార్ డీ. చంద్రమౌళి, మున్సిపల్ కమిషనర్ మనోజ్, డీవైఓ శ్యాంసుందర్, ఎస్సైలు శాతకర్ణి, గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు.