BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 22 August 2026, 03:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 03:23 PM
73 వీక్షణలు

తిరువూరులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు

పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను కూటమి పార్టీ ఆధ్వర్యంలో శనివారం తిరువూరులో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం రాజుపేటలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి చిరంజీవి జన్మదిన వేడుకలను నిర్వహించారు.

అమ్మ ఆశ్రమం, రమణ మహర్షి ఆశ్రమాల్లో అనాథలు, వృద్ధులు, బాలలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ప్రత్యేక గుర్తింపు పొందారని కొనియాడారు.

ఈ కార్యక్రమాల్లో జనసేన సీనియర్ నాయకులు రావుల రాజేందర్, నంబూరి శ్రీనివాసరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ ఆకుల ప్రసాద్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలె శాంతి, సింగం శెట్టి రాంబాబు, ఉయ్యూరు జయప్రకాష్, పెరుమాళ్ల మనోజ్, బెల్లంకొండ సుధీర్, టీడీపీ మైనారిటీ సెల్ నాయకులు షేక్ హనీ తదితరులు పాల్గొన్నారు.