BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 July 2026, 11:55 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ప్రముఖ నాటక కళాకారుడు వాణి రంగారావు కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 11:55 AM
129 వీక్షణలు

తిరువూరులో ప్రముఖ నాటక కళాకారుడు వాణి రంగారావు కన్నుమూత

తిరువూరు, జూలై 20: ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన ప్రముఖ నాటక రంగ కళాకారుడు, గాయకుడు, ఫోటోగ్రాఫర్ వాణి రంగారావు (75) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణవార్తతో తిరువూరు ప్రాంతంలో కళాకారులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

రంగారావు తిరువూరులో వాణి ఫోటో స్టూడియో నిర్వహిస్తూ ఫోటోగ్రఫీ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. మనిషిని చూసి అద్భుతంగా చిత్రాలు గీయడంలో ఆయనకు విశేష నైపుణ్యం ఉండేది. నాటక రంగంలో నటుడిగా, గాయకుడిగా తనదైన ముద్ర వేశారు.

ముఖ్యంగా ప్రముఖ గాయకుడు ఘంటసాల ఆలపించిన పాటలు, భగవద్గీతను ఆయన ఆలపించిన తీరు ఘంటసాల స్వరాన్నే తలపించేలా ఉండేదని అభిమానులు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అనేక సంస్థలు ఘనంగా సన్మానించాయి.

సుమారు ఏడాది క్రితం గంపలగూడెం మండలం పెనుగొలను శివాలయంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో రంగారావును ఘనంగా సత్కరించినట్లు కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు తెలిపారు.

ఎవరు ఆహ్వానించినా సంతోషంగా కార్యక్రమాలకు హాజరై కళాభిమానులను అలరించే వ్యక్తిగా రంగారావు పేరు పొందారని, ఆయన మరణం నాటక కళారంగానికి తీరని లోటని పలువురు కళాకారులు, అభిమానులు పేర్కొన్నారు. పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.