BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 22 August 2026, 01:10 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఉత్తమ ఆర్డీవో కె. కుమార్‌కు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 01:10 PM
68 వీక్షణలు

తిరువూరులో ఉత్తమ ఆర్డీవో కె. కుమార్‌కు ఘన సన్మానం

తిరువూరు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఉత్తమ ఆర్డీవో అవార్డు అందుకున్న కె. కుమార్‌ను ఆర్యవైశ్య ప్రముఖులు శనివారం తిరువూరులో ఘనంగా సన్మానించారు.

ఆగస్టు 15న జిల్లా కలెక్టర్ లక్ష్మీశా చేతుల మీదుగా ఉత్తమ ఆర్డీవో అవార్డు అందుకున్న కె. కుమార్‌ను ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ.. తిరువూరు ఆర్డీవోగా కె. కుమార్ ప్రజా సమస్యల పరిష్కారంలో చూపుతున్న చొరవ, పరిపాలనలో నిబద్ధత, ప్రజలకు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారిగా గుర్తింపు పొందడం తిరువూరు ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు.

ఉత్తమ ఆర్డీవోగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

కె. కుమార్ మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి అభినందించిన ఆర్యవైశ్య ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారంతోనే పరిపాలన మరింత సమర్థవంతంగా కొనసాగుతుందని, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, ప్రముఖులు తదితరులు పాల్గొని కె. కుమార్‌కు అభినందనలు తెలిపారు.