BREAKING
thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 03 August 2026, 08:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:57 PM
59 వీక్షణలు

తిరువూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం

విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ నేతలు

తిరువూరు, ఆగస్టు 3: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి అమలు, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన వంటి అంశాల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థులు, నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.

యువత భవిష్యత్తుతో చెలగాటమాడే విధానాలను ప్రభుత్వం వెంటనే విరమించాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు, యువజన నాయకులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేశారు.