BREAKING
thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం
Date of Publish : 18 June 2026, 08:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుమ్మగూడెం పీఏసీఎస్‌లో ఎరువుల పంపిణీ పరిశీలించి – రైతులకు APAIMS 2.0 ద్వారా వివరాలు అందించిన ఏవో బి శివశంకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 08:25 PM
196 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని తుమ్మగూడెం పీఏసీఎస్‌ను సందర్శించి యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించినట్లు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్ (APAIMS) 2.0 వెబ్‌సైట్ ద్వారా రైతులకు ఎరువుల కేటాయింపు విధానంపై అవగాహన కల్పించారు. రైతులతో చర్చించి వెబ్‌సైట్ వినియోగ విధానాన్ని వివరించారు.

వెబ్‌సైట్‌లో రైతు ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ధృవీకరణ పూర్తి చేసిన వెంటనే పంట విస్తీర్ణం, పంట రకం ఆధారంగా దఫాల వారీగా కేటాయించిన డీఏపీ, యూరియా వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీంతో రైతులు తమకు కేటాయించిన ఎరువులను సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు.

అలాగే APAIMS వెబ్‌సైట్ ద్వారా కౌలు రైతులు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూములు సాగు చేస్తున్న రైతులు కూడా ఎరువులు పొందే ప్రక్రియ సులభతరం చేసినట్లు వివరించారు. రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి పంట వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన సహాయక అధికారులు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేస్తారని తెలిపారు.