BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 04:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుమ్మగూడెంలో ఘనంగా వైఎస్సార్ జయంతి కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 04:56 PM
159 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షులు మాదల వెంకట నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు మాదల వెంకట నరసింహారావు మాట్లాడుతూ సంక్షేమం అంటేనే వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. అలాంటి మహానేత మన మధ్య భౌతికంగా లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు.

వైఎస్సార్ భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.