BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 07 February 2026, 08:14 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బడ్జెట్ 2026లో సామాన్యులకు, మధ్యతరగతికి ఊరట

తెలంగాణ
07 Feb, 2026 - 08:14 AM
384 వీక్షణలు
యూనియన్ బడ్జెట్ 2026లో సామాన్యులకు, మధ్యతరగతికి ఊరట పన్ను రాయితీలు, వైద్య ఖర్చుల తగ్గింపు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి: చిట్టా మధు NTODAY NEWS: గొల్లప్రోలు రిపోర్టర్: బోర శివారెడ్డి యూనియన్ బడ్జెట్–2026లో సామాన్య ప్రజలు, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గొల్లప్రోలు బీజేపీ నాయకుడు చిట్టా మధు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో పన్ను విధానాలు, వైద్య సేవలు, విద్య, ఉపాధి, పర్యాటకం రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు గడువును జూలై 31 వరకు పొడిగించడంతో పాటు, రిటర్న్స్‌లో జరిగిన పొరపాట్లను మార్చి 31 వరకు సవరించుకునే అవకాశం కల్పించారని తెలిపారు. ఇది ఉద్యోగులు, వ్యాపారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. వైద్య రంగానికి సంబంధించి 17 రకాల క్యాన్సర్ మందులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయని చెప్పారు. అలాగే విదేశాల్లో చదువు లేదా పర్యటనల కోసం పంపే నగదుపై వసూలు చేసే TCSను 20 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు కోర్టు ద్వారా లభించే పరిహారంపై వచ్చే వడ్డీకి ఇకపై పన్ను మినహాయింపు ఇవ్వడం కూడా సామాన్యులకు మేలు చేస్తుందని తెలిపారు. మహిళా వ్యాపారుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో “షీ మార్ట్స్” ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఐటీ రంగానికి పన్ను రాయితీలు పెంచడం వల్ల హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు ఊతం లభిస్తుందని, క్లౌడ్ డేటా సెంటర్లపై పన్ను మినహాయింపులు టెక్నాలజీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. ఫార్మా రంగానికి “బయోఫార్మా శక్తి” పథకం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ఔషధ పరిశ్రమలకు ఉపయోగపడుతుందని తెలిపారు. పర్యాటక రంగంలో తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు, చార్మినార్ వంటి చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులు చేయడం అభినందనీయమని అన్నారు. రైతుల కోసం 500 రిజర్వాయర్ల అభివృద్ధి, తోటల పెంపకానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాలకు హైస్పీడ్ రైల్ కారిడార్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణ సౌలభ్యం పెరగడంతో పాటు కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని చిట్టా మధు తెలిపారు. #UnionBudget2026 #CentralBudget #MiddleClassRelief #TaxReforms #HealthcareBenefits #ITSector #WomenEntrepreneurs #TourismDevelopment #RailCorridors Follow us on Website Facebook Instagram YouTube