BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 08 February 2026, 08:37 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి

తెలంగాణ
08 Feb, 2026 - 08:37 AM
377 వీక్షణలు
కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ తెలంగాణ ప్రజలను 420 హామీలు, ఆరు గ్యారెంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 1, 4, 7, 8, 9, 15 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ‘అభయహస్తం’ అంటూ ఆశలు కల్పించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ప్రజల పాలిట ‘భస్మాసుర హస్తం’గా మారిందని వ్యాఖ్యానించారు. అరచేతిలో వైకుంఠం చూపి ఓట్లు వేయించుకుని, ఇప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రాష్ట్రం మళ్లీ వెనక్కి వెళ్లిందని, యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పారు. రెండేళ్లుగా సంక్షేమం కుంటుపడినా ప్రభుత్వానికి పట్టింపులేదని విమర్శించారు. ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు నిరుద్యోగులను నడిరోడ్డుపై నిలబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ధర్మపురిలో సుమారు రూ.9 కోట్లతో మాతా–శిశు ఆసుపత్రిని నిర్మించి ప్రారంభించామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఫర్నిచర్, వైద్యులు, సిబ్బంది కేటాయించక ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిందని ప్రశ్నించారు. అభివృద్ధి పరంపర కొనసాగాలంటే బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #DharmapuriMunicipalElections #BRS #KoppulaEshwar #CongressFailures #UrbanDevelopment #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube