BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 29 December 2025, 08:27 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పీ

తెలంగాణ
29 Dec, 2025 - 08:27 AM
457 వీక్షణలు

ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్

సంక్రాంతికి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని ఆదేశం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంతో పాటు వెలిమినేడు, పెద్ద కాపర్తి ప్రాంతాల్లో జాతీయ రహదారి 65 పై జరుగుతున్న రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు. చిట్యాల పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న గుంతలను వెంటనే మరమ్మతులు చేయాలని, అలాగే పట్టణ పరిధిలో రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చకుండా వదిలేసిన అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా రోడ్డుపై తగిన ఏర్పాట్లు చేయాలని, బ్రిడ్జి కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల వద్ద కూడా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ కె. నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్, పోలీసు సిబ్బంది, జాతీయ రహదారి నియంత్రణ సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube