BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ

తెలంగాణ
29 May, 2025 - 07:44 AM
375 వీక్షణలు
స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో గురువారం సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తిరుప్పావడ సేవ.అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ స్వర్ణగిరీశుడి నిత్య కళ్యాణం మహోత్సవం. NTODAY NEWS: భువనగిరి,మే 29 అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రాతః కాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాతసేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు,ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనాన్ని చేయించడం జరిగింది. మే 29, 5:45 నిమిషాలకు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో సువర్ణ బిందె తీర్ధమును బంగారుబావి నుండి తీసుకువచ్చారు.ఉదయం 6 గంటలకు అలంకార ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య సుగంధ భరితమైన పుష్పమాలలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు.ఉదయం 7 గంటలకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మని మయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళభరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను నిర్వహించారు.గురువారం రోజున స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో లోక కళ్యాణం కోసం శ్రీ సుదర్శన నారసింహ హవనం నిర్వహించారు.కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణ గిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం.స్వామివారికి జరిపే అన్నకూటోత్సవాన్నే తిరుప్పావడ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ జరుగుతుంది.అప్పుడు సుమారు 450 కిలోల అన్న ప్రసాదాన్ని,లడ్డు,వడ,తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు. వేదమంత్రోచ్ఛారణలతో అర్చించి కర్పూరమంగళ హారతులు సమర్పించారు. ఉదయం 10:30 లకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్నఖచిత స్వర్ణాభరణాలతో,పరిమళ భరిత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు.భక్తులు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. ప్రతిరోజు స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.సాయంత్రం 6:30 కు ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తుల గోవింద నామస్మరణలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు తిరువీధి ఉత్సవ సేవ అనంతరం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారు దేదిప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు.అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామివారిని ఆర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు.భక్తులు శ్రీవారిని నయనానందకరంగా దర్శించుకున్నారు. స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. Follow us on Website Facebook Instagram YouTube