ట్యాంక్‌బండ్ వద్ద విషాదం.. నిమజ్జన డ్యూటీలో ఉన్న ఎస్సై మృతి
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. నిమజ్జన డ్యూటీలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న వెంకన్న నిమజ్జన డ్యూటీలో భాగంగా ట్యాంక్‌బండ్‌కు వచ్చినట్లు సమాచారం. రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని బైక్ ఆయనను ఢీకొట్టినట్లు తెలిసింది. ప్రమాదం అనంతరం బైక్ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు సమాచారం.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం, దాని వివరాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.