BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 18 June 2026, 12:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉదయం 10:30 దాటినా తాళం వేసి ఉన్న గ్రామ సచివాలయం.. విధులపై సిబ్బంది నిర్లక్ష్యమా?

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 12:32 PM
127 వీక్షణలు

చింతలపూడి మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయం ఉదయం 10:30 గంటలు దాటినా తెరవకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కార్యాలయానికి తాళం వేసి ఉండటంతో ప్రభుత్వ సేవల కోసం వచ్చిన ప్రజలు సచివాలయం ఎదుట వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సాధారణంగా నిర్ణీత సమయానికి ప్రజలకు సేవలు అందించాల్సిన గ్రామ సచివాలయం తెరవకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ సేవలు, ధ్రువపత్రాలు, సంక్షేమ పథకాల వివరాల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రజలకు సకాలంలో సేవలు అందించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, కొంతమంది సిబ్బంది విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల పనితీరుపై ప్రజల్లో నమ్మకం దెబ్బతినకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, సచివాలయం ఆలస్యంగా తెరవడానికి గల కారణాలను గుర్తించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.