BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 15 June 2026, 05:30 pm
Posted by : V శ్రీనివాస్

ఉద్యోగ దరఖాస్తు ఫీజులను వెంటనే తగ్గించాలి: బీసీ సమాజ్ డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
15 Jun, 2026 - 05:30 PM
290 వీక్షణలు

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు గట్టి షాక్ ఇస్తూ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లకు దరఖాస్తు ఫీజును భారీగా పెంచిన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నుంచి ఒక్క పైసా కూడా తీసుకోబోమని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు గతంలో సుమారు రూ.200గా ఉన్న ఫీజును ఏకంగా రూ.1000కు పెంచడం ద్వారా నిరుద్యోగ యువతపై అదనపు ఆర్థిక భారం మోపుతూ వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు.

​ప్రస్తుతం వేలాది మంది నిరుద్యోగ యువకులు హాస్టళ్లలో, అద్దె గదుల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారని, కుటుంబాలపై ఆధారపడి లేదా అప్పులు చేసి చదువుకుంటున్న వారికి ఈ ఫీజుల పెంపు మరింత భారంగా మారిందని ఆయన తెలిపారు. ఒకే అభ్యర్థి అనేక ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో, ప్రతి దరఖాస్తుకు రూ.1000 చొప్పున చెల్లించడం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. అందువల్ల నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే పెంచిన జాబ్ అప్లికేషన్ ఫీజును తగ్గించి, నిరుద్యోగులకు అనుకూలమైన విధానాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు