BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 29 April 2026, 05:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 05:43 PM
134 వీక్షణలు

ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి – వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

ఎన్టీఆర్ జిల్లా: ఉపాధి హామీ పథకానికి సంబంధించిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.9 కోట్లు వెంటనే విడుదల చేసి ఉపాధి కూలీలకు చెల్లించాలని సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్, జిల్లా అధ్యక్షుడు వి. నాగరాజు కోరారు.

విసన్నపేట మండలం చండ్రుపట్ల ఉపాధి హామీ పనుల ప్రాంతాన్ని సందర్శించిన నాయకులు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూలీలు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్ కారణంగా హాజరు నమోదు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అలాగే, చేసిన పనులకు సంబంధించిన కూలి డబ్బులు సమయానికి అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

ఈ సందర్భంగా కోట కళ్యాణ్ మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి సరిపడా నిధులు కేటాయించి, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూలీలకు సమయానికి వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు.

ఈ కార్యక్రమంలో మల్లేశ్వరి, నాగలక్ష్మి, కృష్ణవేణి తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.