BREAKING
thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా
Date of Publish : 01 July 2026, 05:42 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి--జిల్లా రైతు సంఘం కమిటీ సభ్యులు ర్యాకల శ్రీశైలం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
01 Jul, 2026 - 05:42 PM
154 వీక్షణలు

ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి అని విబిజి రాం జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా రైతు సంఘం కమిటీ సభ్యులు ర్యాకల శ్రీశైలం ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండల కేంద్రంలో బుధవారం రోజున నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ర్యాకల శ్రీశైలం  మాట్లాడుతూ జులై 1 నుండి విబిజి రామ్ జి చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని అన్నారు.కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పోరాడి వామపక్షాలు మద్దతుతో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది చేసి వి బీ జి రామ్ జి చట్టాన్ని తెచ్చింది. అని అన్నారు 125 రోజులు పని దినాలను ప్రచారం చేస్తున్నారు కానీ నిధులు కేటాయింపు బాధ్యతనుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకున్నది. అని అన్నారు గతంలో 90 శాతం నిధులు కేంద్రం ఇచ్చేది దానిలో 40% కోత పెట్టి 60 శాతం మాత్రమే ఇస్తారనీ, 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అన్నారు వ్యవసాయ పనుల సీజన్ లో 60 రోజులు పని బంద్ చేయాలని కొత్త చట్టంలో ఉన్నది అని,కనీస వేతనాలు గురించి కొత్త చట్టంలో పేర్కొనలేదు అని అన్నారు ఉదయం, సాయంత్రం పని ప్రదేశంలో ఫోటోలు అప్లోడ్ చేయాలి, ఫోటోలు అప్లోడ్ అయితేనే వేతనాలు వస్తాయి లేకపోతే రావు అని, ఎక్కడ పని చెయ్యాలో  గ్రామపంచాయతీ ఎంపిక చేసే అవకాశం దీనిలో లేదు అని, కేంద్ర ప్రభుత్వమే ఎప్పుడు ఎవరికి ఎక్కడ పని పెట్టాలి అనేది నిర్ణయిస్తారు అని అన్నారు  కూలీల పని హక్కును హరించే కొత్త చట్టాన్ని మన గ్రామంలో లేదా మండలంలో అమలు చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాo అని అన్నారు కార్మికులందరికీ నష్టం కలిగించే లేబర్ కోడ్స్ అమలు చేయకూడదు అని, విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో సల్లూరి కుమార్, ముక్యర్ల పున్నమ్మ, దేశెట్టి సత్యనారాయణ, దేశెట్టి హరి, మల్లేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు