BREAKING
thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా
Date of Publish : 01 July 2026, 05:00 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

విబి జి రామ్ జి బిల్లు 2025 రద్దు చేయాలి ఎన్ పి ఆర్ డి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
01 Jul, 2026 - 05:00 PM
115 వీక్షణలు

కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుండి అమలు చేస్తున్న విబిజి రామ్ జి 2025 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పిఆర్డి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రోజున భువనగిరి పట్టణంలోని బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జి ప్లే కార్డ్స్ తో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్  మాట్లాడుతూ గత 12 సంవత్సరాలనుండి కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు.నిధులు కేటాయించ కుండా పనిరోజులను తగ్గించిందని అన్నారు.విబిజి రామ్ జి 2025 పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టి జూలై 1 నుండి అమలు చేయాలని నిర్ణయం చేసిందని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం గ్రామీణ ప్రాంత వికలాంగుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. పాత చట్టం ప్రకారం ప్రతి వికలాంగునికి 150 రోజులు పని కల్పిస్తున్నారని అన్నారు. కొత్త చట్టం ప్రకారం 60 రోజులు పని ఉండదని ప్రభుత్వం నిర్ణయం చేసిందని అన్నారు.125 రోజులకు పని రోజులు పెంచామని గొప్పలు చెపుతున్న కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ సీజన్లో 60 రోజులు పని బంద్ పెట్టాలని ఎందుకు నిర్ణయం చేసిందని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం నిధులు కేటాయించాలని నిర్ణయం చేసిందని దీని వలన రాష్ట్ర ప్రభుత్వలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని అన్నారు.సాబ్ కా సాత్ సాబ్ కా వికాస్ అంటున్న మోడీ వికలాంగులకు ఉపాధి కల్పిస్తున్న పథకాన్ని ఎందుకు రద్దు చేశారాని ప్రశ్నించారు.ఉపాధి హామీ పథకం అమలు ద్వారా గ్రామాల్లోని వికలాంగులలో నిరుద్యోగం తగ్గిందని అన్నారు.ప్రభుత్వం నిర్ణయం వలన గ్రామాల్లోని వికలాంగులలో మళ్ళీ నిరుద్యోగం పెరుగుతుందని అన్నారు.ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగం పెంచే విధానాలను అమలు చేయడం సిగ్గుచేటని అన్నారు.ప్రతి వికలాంగునికి జాబ్ కార్డు ఇచ్చి 200 రోజులు పని కల్పించాలని, రోజు కూలీ 800 లకు పెంచాలని డిమాండ్ చేశారు, విబి జి రామ్ జి  రద్దు అయ్యే వరకు ఉద్యమం చెస్తామని హేచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్ల పెళ్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం యాదగిరి, గొడుగు దాసు, పాండాల శ్రీహరి, భగవంతు రెడ్డి, వేషాల గోపి, అవనిగంటి స్వామి తదితరులు పాల్గొన్నారు