BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 01 July 2026, 06:32 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హనుమకొండ జిల్లాలో విషాదం.. విద్యుత్ షాక్‌తో నవ వరుడు, తండ్రి మృతి

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 06:32 PM
111 వీక్షణలు

హనుమకొండ జిల్లా భీమారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి అలంకరణ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్‌ను పరిశీలిస్తున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కుమారుడు మృతి చెందారు.

వివరాల ప్రకారం, ఇంటి వద్ద ఏర్పాటు చేసిన అలంకరణ లైటింగ్ వైర్లను తాకడంతో సాంబయ్య (62) విద్యుదాఘాతానికి గురయ్యారు. తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన కుమారుడు శరత్ (32) కూడా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడు శరత్ ఇటీవలే, జూన్ 24న వివాహం చేసుకున్నాడు. ఆయన హైదరాబాద్‌లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

పెళ్లి వేడుకలు ముగిసిన కొద్ది రోజులకే తండ్రి, కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.