BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

ఉపాధి హామీ కూలీల సమస్యలపై లిబరేషన్ పార్టీ ఆందోళన.. ఫేస్ యాప్ రద్దు చేయాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:48 PM
43 వీక్షణలు

వెలుగోడు మండలం రేగడగూడూరు గ్రామ శివార్లలో జాతీయ ఉపాధి హామీ పనులను సి.పి.ఐ(ఎం.ఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పనుల్లో అమలు చేస్తున్న ఫేస్ యాప్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా కార్మికులు హాజరు నమోదు చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో వారి ఉపాధి హక్కు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ కార్మికులకు రోజువారీ కూలీని రూ.600కు పెంచాలని, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని కోరారు. ప్రభుత్వం 125 రోజుల పనిదినాలను ప్రకటించినప్పటికీ, చాలా చోట్ల కేవలం 100 రోజుల పనికే పరిమితం చేస్తున్నారని విమర్శించారు. ప్రతి వ్యవసాయ కూలీకి పూర్తి స్థాయిలో 125 రోజుల పని దొరికేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పని ప్రదేశాల్లో మజ్జిగ, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని, గ్రామానికి 5 కిలోమీటర్లకు మించి పని ప్రదేశం ఉంటే రవాణా భత్యం చెల్లించాలని కోరారు. మండుతున్న ఎండల నేపథ్యంలో సమ్మర్ అలవెన్స్‌గా 30 శాతం అదనపు వేతనం ఇవ్వాలని, 100 రోజుల పని పూర్తి చేసిన శ్రామికులకు పనిముట్లు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ శ్రామికులు శ్రీనివాసులురాజు, ఇమ్మానియేలు, వెంకటయ్య, సరోజమ్మ, దేవమ్మ, లక్ష్మీ, జయలక్ష్మి, సుశీల, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.