BREAKING
thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 23 June 2026, 06:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉపాధి హామీకి రూ.10 వేల కోట్లు కేటాయించాలి: దుర్గం పుల్లారావు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 06:24 AM
143 వీక్షణలు

చాట్రాయి, జూన్ 23: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి గ్రామీణ పేదల పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నాయని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు విమర్శించారు. సోమవారం నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చిత్తపూరు, జనార్దనవరం గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ పనుల కోసం రాష్ట్రానికి రూ.9,346 కోట్ల నుంచి రూ.10,648 కోట్ల వరకు నిధులు కేటాయించేవారని, ఈ ఏడాది కేవలం రూ.837 కోట్లకు పరిమితం చేయడం పేదలపై తీవ్రమైన అన్యాయమని అన్నారు. ఇందులో కూడా కూలీల పనుల కోసం రూ.735 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 2.6 లక్షల కుటుంబాలకు మాత్రమే పని లభిస్తుందని, గతంలో జిల్లాకు లక్ష కుటుంబాలకు ఉపాధి కల్పిస్తే ఈ ఏడాది కేవలం 9,461 కుటుంబాలకే పని దొరుకుతుందని పేర్కొన్నారు. వ్యవసాయ పనులు లేని సమయంలో గ్రామీణ పేదలు, సన్నకారు రైతులు ఉపాధి హామీ పనులపైనే ఆధారపడుతున్నారని, నిధుల కోతతో వారి జీవనోపాధి సంక్షోభంలో పడిందన్నారు.

గత 20 ఏళ్లలో ఉపాధి హామీ చట్టానికి ఇంత తీవ్రంగా నిధుల కోత విధించడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. 125 రోజుల పని కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, తగిన నిధులు లేక ఆ హామీ అమలుకావడం లేదని విమర్శించారు. కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించే కొత్త విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించకపోవడంతో కేంద్రం కూడా నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. ఫేస్ యాప్ అమలు కారణంగా నెట్‌వర్క్ సమస్యలతో కూలీలు గంటల తరబడి హాజరు నమోదు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని, అనేక ప్రాంతాల్లో పని దొరికినా హాజరు నమోదు కాకపోవడంతో కూలీలు నిరాశతో వెనుదిరుగుతున్నారని తెలిపారు. కనీస వేతనాన్ని రూ.700కు పెంచాలని, ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు.

గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, మహిళలు ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 29న చాట్రాయి మండల కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని కోరారు. ఉపాధి హామీ పథకానికి రాష్ట్రానికి రూ.10 వేల కోట్లు కేటాయించాలని, ఫేస్ యాప్‌ను రద్దు చేయాలని, ఉపాధి కోరిన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని, పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పారలు, గడ్డపారలు, తట్టలు వంటి పనిముట్లు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు, చాట్ల బాబూరావు, ఆడిమెల్లి వెంకటేశ్వరరావు, చలపతి, బంటు పూజిత, లూసియానా తదితరులు పాల్గొన్నారు.