BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 23 June 2026, 07:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉపాధి హామీలో ‘మామూళ్ల’ దందా!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:06 PM
118 వీక్షణలు

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేద కూలీలకు ఉపాధి కల్పించాల్సిన పథకం కొందరు క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదాయ వనరుగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని పలు గ్రామాల్లో పనులకు మస్టర్లు వేయడం, కొత్తగా పేర్లు నమోదు చేయడం, చేసిన పనుల కొలతలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వంటి ప్రక్రియల కోసం కూలీల నుంచి వారానికి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, సాంకేతిక సహాయకుల పేరుతో ఈ వసూళ్లు జరుగుతున్నాయని కూలీలు చెబుతున్నారు.

డబ్బులు ఇవ్వని కూలీలపై వివక్ష చూపుతూ, వారి పనిదినాలు తగ్గించడం, వేతనాల్లో కోత విధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు సాంకేతిక సహాయకులు పని ప్రదేశాలకు వెళ్లకుండానే కార్యాలయాల్లో కూర్చొని కొలతలు నమోదు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో అక్రమాలు మరింత పెరిగిపోయాయని కూలీలు వాపోతున్నారు. పారదర్శకత లేకపోవడంతో ఉపాధి హామీ పథకం లక్ష్యాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పటికైనా జిల్లా అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, కూలీలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.