BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 12 May 2026, 09:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉపాధి పనులు 125 రోజులు కొనసాగించాలి - వేముల బక్కయ్య డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 09:23 AM
265 వీక్షణలు

NTODAY NEWS నూజివీడు

ఉపాధి హామీ పనులను నిరాటంకంగా కొనసాగిస్తూ కూలీలకు కనీసం 125 రోజులపాటు పని కల్పించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్యదర్శి వేముల బక్కయ్య డిమాండ్ చేశారు. సమస్యపై వెంటనే స్పందించిన నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఏలూరు జిల్లా నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఈ ఏడాది జనవరి నుంచి ఉపాధి పనులు ప్రారంభించినప్పటికీ, రెండు వారాల తర్వాత ముందస్తు సమాచారం లేకుండానే పనులు నిలిపివేశారని బక్కయ్య తెలిపారు. పనులు ఎందుకు ఆపారనే విషయంపై సంబంధిత అధికారులను ప్రశ్నించినా స్పందన రాలేదన్నారు.

దీంతో పనులు నిరంతరంగా కొనసాగించాలని, పనులు కల్పించని రోజుల కూలి చెల్లించాలని కోరుతూ గ్రామ కూలీల సంతకాలతో పీజీఆర్ఎస్‌లో నూజివీడు సబ్ కలెక్టర్‌కు అర్జీ సమర్పించినట్లు చెప్పారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులను వివరణ కోరడంతో పాటు పనులు నిలిపివేయకుండా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.

కూలీలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పనులు నిలిపివేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించినట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సబ్ కలెక్టర్‌కు బక్కయ్య ధన్యవాదాలు తెలిపారు.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే విధంగా తీసుకొచ్చిన వి.బి.జి. రాంజీ పథకం కూలీల హక్కులను దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. పేస్ యాప్ సక్రమంగా పనిచేయక చాలామంది కూలీలు పనులకు హాజరు కాలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ విధానాల ద్వారా హాజరు నమోదు చేసి పనులు కల్పించాలని కోరారు.

వి.బి.జి. రాంజీ పథకాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, 200 రోజుల పని కల్పించాలని, రోజుకు రూ.700 కూలి చెల్లించాలని బక్కయ్య డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె పాము భవాని తదితర కూలీలు పాల్గొన్నారు.