BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 14 August 2026, 05:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వాముకుంట్లలో గ్రామసభ.. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆర్డీఓ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 05:37 PM
76 వీక్షణలు

వాముకుంట్లలో గ్రామసభ.. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఆర్డీఓ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం

ఆగస్టు 14: ఒక నెల – ఒక గ్రామం, నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా తిరువూరు మండలం వాముకుంట్ల గ్రామంలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ హాజరై గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గ్రామ ప్రజలు తమ సమస్యలను ఆర్డీఓ దృష్టికి తీసుకువచ్చి అర్జీలు అందజేశారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిశీలించిన ఆర్డీఓ.. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రామంలో మౌలిక వసతులు, రెవెన్యూ పరమైన సమస్యలు తదితర అంశాలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్, గ్రామ పెద్దలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.