BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 12 July 2026, 10:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వాసవి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అత్తులూరి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 10:04 AM
132 వీక్షణలు

విజయవాడ, జూలై 12: వాసవి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అత్తులూరి శ్రీనివాసరావు నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు వెల్లంపల్లి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు జారీ చేయగా, ఇంటర్నేషనల్ అధ్యక్షుడు డాక్టర్ కోన శ్రీనివాసరావు సమక్షంలో బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకంతో జిల్లా ఆర్యవైశ్య వర్గాల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

ఈ సందర్భంగా అత్తులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్యవైశ్య కుటుంబాల అభ్యున్నతికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, విద్య, ఉపాధి, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. సంఘం బలోపేతంతో పాటు యువతను సంఘ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.