BREAKING
ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి తెలంగాణ జర్నలిస్ట్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియామకం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 28 July 2026, 05:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వేమిరెడ్డిపల్లి, కొర్లమండ గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Jul, 2026 - 05:08 PM
68 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని వేమిరెడ్డిపల్లి, కొర్లమండ గ్రామాల్లో మంగళవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి జి. రాజ్యలక్ష్మి రైతులకు ఖరీఫ్ సాగు, పంటల ఎంపిక, పంటల బీమాపై అవగాహన కల్పించారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో బోరు సదుపాయం ఉన్న రైతులు మాత్రమే వరి సాగు చేయాలని సూచించారు. మిగతా రైతులు మినుములు, పెసలు, జొన్నలు, రాగులు వంటి ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపాలని తెలిపారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో అపరాల పంటల నమోదుకు మరో మూడు రోజుల మాత్రమే గడువు ఉందని, వరి పంట నమోదుకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉందని చెప్పారు. రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని కోరారు.

యూరియా కొనుగోలు చేసే రైతులు ఏపీఎం–ఏఐఎంఎస్‌లో నమోదు చేసుకోవాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శులు మురళి, శ్రీరామ్మూర్తి, రైతు సేవా కేంద్రం సిబ్బంది స్వాతి, రాజేష్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.