BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 22 August 2026, 08:15 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైసీపీ ఇంచార్జ్‌లకు అగ్నిపరీక్షగా స్థానిక ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 08:15 AM
104 వీక్షణలు

వైసీపీ ఇంచార్జ్‌లకు అగ్నిపరీక్షగా స్థానిక ఎన్నికలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమవుతోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నియోజకవర్గాల వారీగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 25న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పార్టీ ఇంచార్జ్‌లతో జగన్‌ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి సన్నద్ధత వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

స్థానిక ఎన్నికలు పార్టీ ఇంచార్జ్‌లకు అసలు పరీక్షగా మారనున్న నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంపై జగన్‌ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా కేడర్‌ను సిద్ధం చేయాలని ఇంచార్జ్‌లకు సూచించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలు, ప్రజా మద్దతు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని స్థానిక ఎన్నికల కోసం వైసీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.