BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 14 April 2026, 12:28 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

వెల్గటూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కాంగ్రెస్ నాయకుడు కుశ్నపెల్లి లక్ష్మణ్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
14 Apr, 2026 - 12:28 PM
221 వీక్షణలు

ఘనంగా డా.బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

వెల్గటూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కాంగ్రెస్ నాయకుడు కుశ్నపెల్లి లక్ష్మణ్

​వెల్గటూరు, ఏప్రిల్ 14 (న్యూస్):

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంనూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కుశ్నపెల్లి లక్ష్మణ్ వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు.

​మండల కేంద్రంలోని రాయపట్నం హైవే, కరీంనగర్ మరియు గొల్లపల్లి వెళ్లే ప్రధాన కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

​ఈ సందర్భంగా కుశ్నపెల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ:

​"దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు."

​ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.