BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

వెలిగొండ నిర్వాసితుల కన్నీటి గాథ.. పరిహారం కోసం పోరాటం!

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 08:29 AM
41 వీక్షణలు

వెలిగొండ నిర్వాసితుల కన్నీటి గాథ.. పరిహారం కోసం పోరాటం!

ముంపు గ్రామాలపై హడావుడి నిర్ణయాలు.. భవిష్యత్తుపై ఆందోళనలో బాధితులు

మేజర్లైన యువతకు మొండిచేయి.. పునరావాసం లేకుండానే తరలింపునకు ఒత్తిడి

మార్కాపురం:

వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల జీవితాల్లో మాత్రం ఇంకా చీకట్లు తొలగలేదు. తమ భూములు, ఇళ్లు వదులుకుని ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్న వేలాది కుటుంబాలు ఇప్పుడు న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తయిందనే కారణంతో గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తుండగా, తమ సమస్యలు పరిష్కరించకుండా ఎలా వెళ్లిపోవాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.

భూముల సేకరణ సమయంలో మైనర్లుగా ఉన్న పలువురు ఇప్పుడు పెద్దవారయ్యారు. కొందరికి వివాహాలు జరిగి కుటుంబాలు ఏర్పడ్డాయి. అప్పట్లో తమ పేర్లు లెక్కల్లో లేకపోవడంతో ఇప్పుడు తమ భవిష్యత్తు ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1600 నుంచి 1700 మంది వరకు అప్పట్లో మైనర్లుగా ఉండగా, ప్రస్తుతం వారు మేజర్లయ్యారని నిర్వాసితులు చెబుతున్నారు.

పాత ధరలతో పరిహారం.. పెరిగిన ధరలకు తగ్గ న్యాయం ఏది?

వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో పరిహారం విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 2019లో నిర్ణయించిన ప్యాకేజీ ప్రకారం ఒక్కొక్కరికి రూ.12.50 లక్షలు చెల్లిస్తున్నారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు భూముల ధరలు భారీగా పెరిగినా పరిహారం పెంచలేదని నిర్వాసితులు అంటున్నారు.

అప్పట్లో ఎకరం ధర రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండగా, ప్రస్తుతం అదే భూమి ధర రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు చేరిందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒకేసారి పరిహారం పేరుతో పునరావాసానికి దూరం

ప్రభుత్వంపై నమ్మకంతో ఒకేసారి పరిష్కారం పద్ధతికి అంగీకరించిన వారు 3,360 మంది ఉన్నారు. వీరిలో 2,400 మందికి మాత్రమే పరిహారం అందిందని నిర్వాసితులు చెబుతున్నారు.

రూ.12.50 లక్షలతో ప్రస్తుతం ఇంటి స్థలం కూడా కొనలేని పరిస్థితి ఉందని, పునరావాస కాలనీల్లో ఇళ్లు లేదా స్థలాలు ఇవ్వకపోవడం తమకు అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పునరావాసం పూర్తికాకుండానే ఖాళీ చేయాలా?

2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి బదులుగా భూమి, భూమిలేని వారికి ఉపాధి, పునరావాస కాలనీల్లో ఇళ్లు, మెరుగైన పరిహారం అందాల్సి ఉందని నిర్వాసితులు గుర్తుచేస్తున్నారు.

వెలిగొండ పరిధిలో గుర్తించిన నిర్వాసిత కుటుంబాల సంఖ్య కూడా పెరిగిందని, కానీ ప్రభుత్వం మాత్రం పాత లెక్కలతోనే ముందుకు సాగుతోందని ఆరోపిస్తున్నారు.

సాధారణ ప్యాకేజీ కింద ఉన్న వారికి పరిహారంతో పాటు ఇంటి నిర్మాణానికి స్థలం కేటాయించినా, చాలా మందికి ఇప్పటికీ పట్టాలు అందలేదని చెబుతున్నారు. తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కూడా పూర్తిగా అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"మా జీవితాలను రోడ్డుపాలు చేయొద్దు"

గ్రామాలను వెంటనే ఖాళీ చేయాలని చెప్పడం తమపై అన్యాయమని నిర్వాసితులు అంటున్నారు. కనీసం ఆరు నెలల ముందే పరిహారం ఇచ్చి ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవారమని చెబుతున్నారు.

హఠాత్తుగా తరలిస్తే సాగులో ఉన్న పంటలు నష్టపోవడంతో పాటు పశువులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. అద్దె ఇళ్లకు వెళ్లినా నెలకు వేల రూపాయల భారం పడుతుందని చెబుతున్నారు.

కనీసం రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్

ప్రస్తుత ధరలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో కుటుంబానికి కనీసం రూ.20 లక్షల పరిహారం అందించాలని నిర్వాసితులు కోరుతున్నారు. పునరావాసం, ఉపాధి, మౌలిక వసతుల కల్పన పూర్తయ్యే వరకు గ్రామాల తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన తమకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని వెలిగొండ నిర్వాసితులు కోరుతున్నారు.