BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 31 March 2026, 02:16 pm
Posted by : సిర మహేష్

వెల్లంకి గ్రామంలో కోతుల నియంత్రణకు చర్యలు | సర్పంచ్ చొరవ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
31 Mar, 2026 - 02:16 PM
384 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో కోతుల ఉనికి గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఇళ్లలోకి చొరబడడం, పంటలను నాశనం చేయడం వంటి సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు.

ఈ సమస్యను గమనించిన గ్రామ సర్పంచ్ శ్రీమతి ఇడెం రాధా శ్రీనివాస్ గారు తమ సొంత నిధులతో కోతులను బంధించేందుకు ప్రత్యేక బోనులు తయారు చేయించారు. గ్రామస్థుల సమస్యలపై స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకోవడం విశేషం.

ఈ రోజు గ్రామంలో కోతులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా మనుషులను పిలిపించి, సుమారు 100 కోతులను బంధించడం జరిగింది. ఈ చర్య ద్వారా గ్రామంలో కొంతవరకు ఉపశమనం లభించింది.

ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ, గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం కోసం కొత్త బోనులను ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టుకున్న కోతులను శ్రీశైలం అడవులు లో విడిచిపెట్టడం జరుగుతుందని చెప్పారు.

గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మిర్యాల రాజ్ కుమార్, సెక్రెటరీ మోహన్ గారు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.