BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
03 Jun, 2026 - 07:01 PM
33 వీక్షణలు

వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు

మాజీ మంత్రి విడదల రజిని వెల్లడి

చిలకలూరిపేట, జూన్ 3: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో, ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విడదల రజిని తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 4న నియోజకవర్గంలోని మూడు మండల కేంద్రాలు మరియు చిలకలూరిపేట పట్టణంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో రూపొందించిన పోస్టర్, బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాను యడ్లపాడు మండల కేంద్రంలో నిర్వహించే నిరసనలో పాల్గొంటానని రజిని వెల్లడించారు.

అలాగే ఈ నెల 8వ తేదీన మహిళలు, యువతతో పాటు వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నట్లు, జూన్ 12న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.